Categories
సౌందర్య పోషణకు బీట్ రూట్ ఎంతో ఉపయోగ పడుతోంది అంటారు ఎక్స్ ఫర్ట్స్ .బీట్ రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ప్రోటీన్ వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి,వీటిలోని సిలికాన్ ఖనిజం గోళ్ళు జుట్టు పెరగడం లో కీలకంగా పని చేస్తుంది.బీట్ రూట్ దుంప ఉడకబెట్టి మెత్తగా గుజ్జు చేయాలి దీనికి చెంచా బాదం నూనె రెండు చుక్కలు తేనె కలిపి ముఖానికి ప్యాక్ గా వేసుకుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది.రసాయనాలు కలిపిన రంగులు జుట్టుకు హాని చేస్తాయి.హెన్నా కలిపేప్పుడు గోరింటాకు మిశ్రమానికి బీట్ రూట్ రసాన్ని కూడా కలిపితే చాలా చక్కని రంగు వస్తుంది.హెయిర్ డై లాగా కనిపిస్తుంది.