ఈజీ హోమ్ అనే కొత్త స్టార్టప్ ప్రారంభించింది వృద్ధులకు డిజిటల్ స్కూల్ నేర్పిస్తున్నారు బెంగళూరుకు చెందిన అక్కాచెల్లెళ్ళు శ్రీయ బజాజ్ సురభి.కరోనాతో అందరూ ఇంటికే పరిమితమైన సందర్భంలో స్మార్ట్ ఫోన్ లో ఆన్ లైన్  ద్వారా వస్తువులు కొనుగోలు చేయటం పెద్ద వాళ్లకు సరిగ్గా తెలియక ఇబ్బందులు పడుతున్నారు.ఎం.బి.ఏ పూర్తి చేసిన ఈ యువ వ్యాపారవేత్తలు పెద్ద వాళ్ల కోసం జూమ్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ వాడకం ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేయటం నేర్పించటం మొదలుపెట్టారు.ఈ తరగతుల గురించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే అది కాస్తా వైరల్ అయింది.ఎంతోమంది ఫోన్స్ చేసి తమకు నేర్పించమని అడిగారు అలా ఈ ‘ఈజీ హోమ్’ స్టార్టప్ మొదలైంది.

Leave a comment