14 సంవత్సరాల కే స్టార్టప్ ప్రారంభించింది అందరి ఆశీర్వచనాలు పొందింది.తన్వి అరవింద్ చెన్నైలో శిష్య స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసింది.తొమ్మిదో తరగతి లో ఉండగానే ‘టెక్ ఎడ్ ఎన్’ అనే స్టార్టప్ ని ప్రారంభించింది. వృద్ధులకు టెక్నాలజీ బోధించడం ఈ స్టార్ ఉద్దేశ్యం.వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు అయిన వారు అందుబాటులో లేనప్పుడు సులువుగా సాంకేతికత వాడుకొని అవసరాలు తీర్చుకొనేలా చెయ్యటం తన్వి ప్రధాన లక్ష్యం.టెక్నాలజీ తో ఉబర్ బుక్ చేసుకోవటం ఆహారం ఆర్డర్ చేసుకోవటం ఆన్ లైన్ షాపింగ్,టికెట్స్ బుక్ చేసుకోవటం ఇష్టమైన వారితో జూమ్ ఫేస్ టైమ్ యాప్ లను ఉపయోగించి మాట్లాడటం నేర్పుతోంది తన్వి అరవింద్.ఇప్పటి వరకూ వంద మంది కంటే ఎక్కువ మంది పెద్దవాళ్లకు ఈ టెక్నాలజీ నేర్పింది తన్వి.

Leave a comment