అరటి పండు ఆరోగ్య ప్రధాయిని అంటారు కదా. ఎంతో ఇష్టంగా తినటం కూడా. కానీ దాని తొక్కను మాత్రం పట్టించుకోము. అరటి పండు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చు, దాని తొక్కను ఉపయోగించి కూడా అన్నే ప్రయోజనాలు పొందవచ్చు. దంతాలపై మరకలను పోగొట్టుకోవాలంటే అరటి పండు తొక్కను పళ్ళ పైన ఐదు నిమిషాల పాటు రుద్దితే పళ్ళు మెరుస్తాయి. ఒక్కటి రెండు సార్లు చేస్తే పూర్తి ఫలితం చూడవచ్చు. మొటిమలకు కూడా ఇదే చిట్కా స్నానానికి ముందు మొటిమల పైన అరటి పండు తొక్కలతో మర్దనా చేసి తర్వాత స్నానం చేయవచ్చు. కొద్ది రోజులలో ఫలితం కనిపిస్తుంది. అలాగే మొహం పైన మచ్చలు, అకాల వృద్దాప్యానికి చిహ్నాలు చిన్న వయస్సులో ఈ మచ్చలు వస్తే, పండిన అరటి పండు తొక్కను మెత్తగా చేసి స్నానానికి ముందు ముఖానికి పట్టించి బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే నెమ్మదిగా మచ్చలు తగ్గు ముఖం పడతాయి. బూట్లు, లెదర్, వెండి వస్తువులు కూడా అరటి తొక్కతో రుద్దితే తళ తళా మెరుస్తాయి.

Leave a comment