సలాం- వాలేకుం-సలాం భాయ్,బెహెనో!!

తీపి పండుగ “రంజాన్” తరువాత రెండు నెలలకు వచ్చేది బక్రీద్.ఈ రోజు ముస్లిం సోదర,సోదరీమణులు సంతోషంగానూ లేదా విచారంగాను ఉండరు.ఆనవాయితీగా ఆచరిస్తారు.
సలీం అల్లాకి పరమ భక్తుడు.ఎల్లప్పుడూ అల్లాని స్మరిస్తూ సంతానం కోసం ఎదురుచూస్తూ క్రమం తప్పకుండా నమాజ్ చేసేవాడు.అల్లాకి దువాతో కొంత కాలానికి కొడుకు ఇస్మైల్ పుట్టాడు.చాలా ప్రేమగా అతనిని కంటికి రెప్పలా చూసుకుంటూ సంతోషంగా ఉన్నాడు.ఒకనాడు సలీంకి కలలో అల్లా కనిపించి తన భక్తిని పరిక్షించటానికి తన ముద్దల కుమారుడు ఇస్మైల్ ని బలి కోరాడు.వెంటనే తన కుమారుడిని బలికి సిధ్ధం చేశాడు.
అల్లా తన భక్తి కి మెచ్చి కుమారుడు ఇస్మైల్ ను రక్షించి ఆ ప్రదేశం లో మేకను బలిగా ప్రత్యక్షం చేసారు.ఆనాటి నుండి బక్రీద్ రోజున ఆరోగ్యంగా ఉన్న మేక,ఒంటెను బలి ఇస్తారు.మనస్పూర్తిగా నమాజ్ చేసిన తరువాతే జంతు బలి ఇవ్వడానికి అర్హత.ఈనాడు ఖుర్బాని అనే రుచికరమైన వంటకం చేసి నలుగురుకీ పెట్టి అల్లా మియ్యాక షుక్రియ హై అని ఒకరినొకరు పలకరించుకుంటారు.

       -తోలేటి వెంకట శిరీష

Leave a comment