Categories
నీరు తెగేందుకు ఒక ఫార్ములా పద్ధతి అంటూ ఏవీ వుండదు. దాహం వేసినప్పుడల్లా తాగొచ్చు. కానీ రోజుకు రెండు మూడు లీటర్ల నీటిని లక్ష్యంగా పెట్టుకుని అప్పుడప్పుడో గ్లాసు చొప్పున దాహంతో నిమిత్తం లేకుండా తాగాలి. జ్యూస్, పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళ రసం, సూప్ వంటి పానీయాలు కూడా ఈ నీటి కోవలోకే వస్తాయి. దాహం వేస్తె నోరు ఎండినట్లుంటుంది. ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాయామం చేస్తున్నా, వాకింగ్ లోనైనా ఎండలోకి వెల్లివచ్చినా నీటి అవసరం ఎక్కువ లేనట్లయితే డీహైడ్రేషన్ వస్తుంది. ఉదయం లేస్తూనే గ్లాసుల కొద్దీ నీళ్ళు తాగకపోయినా పర్లేదు. దీని వల్ల శరీరం పై ఒత్తిడి వస్తుంది. సోడియం ఇతర లవణాలు డైల్యూట్ అవుతాయి దాహం అయినా లేకపోయినా రోజంతా తాగుతూనే వుండలన్నది నిపుణుల సలహా.