సాయంత్రం ఏదైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే కాసిన్ని ఎండు ద్రాక్ష పండ్లు ప్రయత్నం చేయచ్చు. ఇది తక్షణ శక్తిని ఇవ్వటమే కాకుండా చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో పీచు, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.ద్రాక్షలోని పొటాషియం, మెగ్నీషియం శరీరంలో ఆమ్ల తత్వం పెరగకుండా చేస్తాయి.  బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉండటం తో రక్తహీనత రాదు. చర్మం పొడిబారి పోకుండా ఉంటుంది. వీటిలో ఉండే జింక్, విటమిన్-సి సెలీనియం లు చర్మానికి మేలు చేస్తాయి.

Leave a comment