1891 లోజన్మించిన నెల్లీసాచ్స్ జర్మనీ యూదు కవయిత్రి. తండ్రి పారిశ్రామికవేత్త, తల్లి గృహిణి,ఒక్కతే కూతురు కావటం చేత తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. సెల్మా లోగెర్లోఫ్ రాసిన నవల ‘గోస్టా బెర్లింగ్ సగా’ తో ప్రభావితురాలైంది నెల్లీసాచ్స్. 1933లో జర్మనీ నాజీలకు హస్తగతం అయ్యాక సాచ్స్ జీవితం ఏకాంతంలోకి నెట్టబడిరది. 1966లో సమస్త యూదు ప్రజల విషాదం పట్ల భావోద్వేగ తీవ్రతతో, పౌరాణిక నాటకీకరణలతో నెల్లీసాచ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మెచ్చుకొనేలాగా రచనలు చేసినందుకు గాను సాహిత్య నోబెల్ బహుమతి ని అందుకొన్నది.