ఒలంపిక్స్ కి అర్హత సాధించిన తొలి మహిళా సెయిలర్ గా, తొలి భారతీయ క్రీడాకారిణిగా కీర్తి అందుకొంది నేత్ర. చెన్నై లో SRM కాలేజీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది నేత్ర. తొలిసారిగా 2014లో చెన్నైలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. 2018లో ఆసియన్ గేమ్స్ లోనూ గత సంవత్సరం మియామ్ లో జరిగిన హెంపెల్ వరల్డ్ సిరీస్ లోనూ సత్తా చాటింది ఒమాన్ లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్ లోని లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్స్ లో పోటీ పడిన నేత్ర 21 పాయింట్లతో టాప్ లో నిలిచి నేరుగా ఒలింపిక్స్ పాల్గొనేందుకు అర్హత సాధించింది.