Categories
చదువు ,ఉద్యోగం లేకుంటే గంటలతరబడి అంతులేని ఇంటిపని నేటి ఆధునిక యవతకి విపరీతమైన అలసట,ఒత్తిడి ఇస్తున్నాయి. ముఖ్యంగా వేధించేది నిద్ర లేమి. ఈ సమస్యకి పరిష్కారంగా వైద్యులను ఆశ్రయించటం మందు తీసుకోవటం సహాజం. కానీ ఔషధమొక్కలు మనసుకి ప్రశాంతత ఇస్తాయి. ఇంట్లో కుండీల్లో పెంచుకోగలిగే రోజ్ మేరి వంటల్లో సువాసన కోసం ,రుచికోసం ఉపయోగిస్తారు. ఈ రోజ్ మేరి పరిమళం ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జ్ఙాపక శక్తి కూడా పెరుగుతోంది అంటారు .నిద్ర పోయో ముందర ఈ రోజ్ మేరి ఆకుల్నీ నలిపి వాసన చూస్తే మనసు శాంతి కలిగి నిద్ర నిస్తుంది. కుండీల్లో పెంచుకోవచ్చు.