Categories
షార్ట్ మెమొరీ లాస్ ..ప్రతిచొట వినబడుతోంది. మరచి పోతున్నాను, గుర్తుండటం లేదు అంటుంటారు.ఈ షార్ట్ మెమొరీ లాస్ కాస్త కొంత కాలానికి లాంగ్ టర్మ్ మెమొరీలాస్ అయిపోకుండా సుఖంగా ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపొమ్మంటున్నారు డాక్టర్లు. మంచి నిద్రకు జ్ఞాపక శక్తికి సంబంధం ఉంది. మంచి నిద్ర దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి సామార్ధ్యాన్ని పెంపొందిస్తుందని బెల్జియంలోని లీగ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. మెదడులో జ్ఞాపక శక్తికి సంబంధించిన హిప్పో కాంపస్ ఏరియా శక్తి మంతంగా పని చేయటానికి సోయాఫుడ్ దోహాదం చేస్తుందని వారు తెలిపారు.