ఇప్పుడు కాలేజీ అమ్మాయిలకు స్కర్టులే ఇష్టం. లాంగ్ నీ లెంగ్త్ ,షార్ట్ ,ఇలా స్కర్ట్స్ లో ఎన్నో రకాలు వచ్చాయి. అయితే ఆ దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించాలి అంటే దానికి కరక్ట్ టాప్ జతగా ఉండాలి. పొడవాటి స్కర్టుకు చిన్న టాప్ ఉండాలి. స్కర్ట్ సాదాగా ఉంటే గ్రాఫిక్ టీషర్ట్ మ్యాచ్ . షిఫాన్ స్కర్టులకు వీ నెక్ ,క్రాప్ టాప్ అందం. ఇక పార్టీల్లో అయితే మొటాలిక్ సీక్వెన్స్ స్కర్ట్స్ మెరుస్తూ అందంగా ఉంటాయి. అప్పుడు టాప్ మెరుపులు లేకుండా పూర్తి ప్లెయిన్ టాప్ జత చేయాలి. ముదురు రంగు ప్రింట్లు ,గ్రాఫిక్ డిజైన్ ఉన్న స్కర్టు ఎంచుకొంటే వాటి మీదకు పూర్తిగా తెల్లని టాప్ లు చక్కగా ఉంటాయి.

Leave a comment