Categories
ఇప్పుడు చాలా ఉద్యోగాలో నైట్ షిఫ్టులు తప్పనిసరవుతున్నాయి. ఒక అధ్యాయనం ఈ రాత్రి వేళ డ్యూటీ చేసే వాళ్ళు మాములు వాళ్ళ కన్నా అదనపు బరువు పెరుగుతున్నారని తేల్చింది. రాత్రి వేళ చేసే ఉద్యోగాలతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రాత్రివేళ నిద్ర మేల్కోనేందుకు తాగే పానీయాలు ఎక్కువ ఆహారం తీసుకోవటం పోషకాహరం పై శ్రద్ద చూపించే అవకాశం లేకపోవడం,పగలు నిద్ర పోవడం వల్ల ఇవే అధిక బరువుకు కారణమవుతున్నాయంటున్నారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని నైట్ షిఫ్టులో పని చేసే వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపించాలి. పోషకాహారం తీసుకోవటం వ్యయామం వంటి విషయాల్లో శ్రద్ద చూపించాలని అద్యాయనాలు చెపుతున్నాయి.