Categories

మహిళలకు స్పూర్తిగా చెప్పుకోదగిన వాళ్ళు ఇప్పటి రోజుల్లో ఎందఱో వున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా డిప్యూటీ కలక్టర్ కట్టా హైమావతి. బ్నగారు పళ్ళెంలో భోజనం చేస్తూ ఎదగలేదు ఆమె. దృఢమైన పట్టుదలతో ఎదురీదిరి సక్సెస్ సాధించారామె. గుంటూరుకు చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు హైమావతి . ఇంటర్మీడియేట్ తర్వాత హైదరబాద్ కు వలసి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ దూర విద్యలో డిగ్రీ, పీజీ చదువు పూర్తి చేశారు. టీచర గా ఎంపికై పట్టుదలతో డిప్యుటీ కలక్టర్ స్దాయికి చేరుకున్నారు. వున్న స్ధితి నుంచి ఉన్నత స్ధితికి ఎదిగిన ఆమె నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత.