నీరా టాండన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ముఖ్య వ్యూహ కర్తల్లో ఒకరు .ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ అనే మేథో సంస్థకు నీరా అధ్యక్షత వహిస్తున్నారు.బైడెన్ బృధంలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ కు డైరెక్టర్ హోదాలో బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకునే ఆర్థిక నిపుణులు సలహా దారులకు నీరా నేతృత్వం వహించనున్నారు. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె ఆరోగ్య విభాగానికి సంబంధించి సలహా దారుగా బాధ్యతలు నిర్వహించారు. భారతదేశం నుంచి అమెరికా వలస వెళ్ళిన మాయా టాండన్ దంపతులకు బోస్టన్ బెడ్ ఫోర్ట్ లో 1970లో నీరా టాండన్ పుట్టారు.ఉన్నత విద్యాభ్యాసం తరువాత, రాజకీయ రంగంలో అడుగుపెట్టి క్లింటన్,ఒబామా వంటి ప్రముఖులతో పనిచేశారు.

Leave a comment