చాలా సహజంగా చెప్పుకోవలసిన విషయాలు వార్తల్లో చదువుతున్నాం. ఒక అత్తగారు మనుమరాలిని ఇచ్చిన కోడలికి కారు బహుమతిగా ఇచ్చింది. కడుపులో వున్నది ఆడపిల్ల అని తలియగానే చంపేసే సంప్రదాయపు రోజుల్లో వున్నాం కనుక ఇది ఆ అత్తగార్నే అభినందించవలసిన వార్త రాష్ట్ర ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన ప్రేమా దేవి ఉత్తర్ ప్రదేశ్ లోని హామీద్ పూర్ జిల్లా లో వుంటారు. ఆమెకు ఒక్కడే కొడుకు. కోడలు ఖుష్బు చక్కని పాపాయిని కన్నది. ఇక వాళ్ళ ఇంట్లో పండగోచ్చింది. బంధు మిత్రులకు పార్టీ ఇచ్చారు. తన ఇంటికి చక్కని బంగారు తల్లిని తెచ్చిన కోడలికి ప్రేమా దేవి అందమైన కారుని బహుమతిగా ఇచ్చారు. ప్రేమా దేవి గురించి ఈ కధ వింటే ఆడపిల్లను వద్దు అనుకునే కుటుంబాలకు బుద్ది వస్తుందేమో!

Leave a comment