బెంగళూరు ట్రిపుల్ ఐటీ నుంచి డిజిటల్ సొసైటీ ప్రోగ్రామింగ్ లో మాస్టర్ తీసుకున్నాను ఎంత చదువుకున్నా పుట్టుక తోనే కంటి చూపు పోయినా నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏ కంపెనీ సిద్ధంగా లేదు నా అలాంటి చూపు లేని వాళ్లకు స్టెమ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నాను. ఐటీ నిపుణురాలు సుప్రియడే ప్రొఫెసర్ అమిత్ ప్రకాష్ తో కలసి విజన్ ఎంపవర్ సంస్థ స్థాపించాను దీనిద్వారా ప్రయోగాత్మక పద్ధతిలో సబ్జెక్ట్, డిజిటల్ లిటరసీ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వచ్చు అంటోంది కర్ణాటక అమ్మాయి వై విద్య సైన్స్ ఎంచుకున్నందుకు ఎందరో హేళన చేసిన ఆమె మాస్టర్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. తనలాంటి చూపు లేని వాళ్లకు విద్యాదానం చేస్తోంది వై.విద్య ఆమె స్థాపించిన ఈ సంస్థ ద్వారా బాల్య దశలోనే సాంకేతికత ఉపయోగించుకునే ప్రోగ్రామ్స్ నేర్చుకోవచ్చు ప్రస్తుతం విద్య ఆరు రాష్ట్రాల్లోని 30 పాఠశాలల్లో చూపు లేని వారికి పాఠాలు బోధిస్తోంది. ఆమెతో పాటు 300 మంది వాలంటీర్లు కూడా పని చేస్తున్నారు.

Leave a comment