Categories
చాలా మందికి మోకాళ్ళ సమస్యలుంటాయి. ఆ నేప్పులతో వ్యాయామం చేయాలో వద్దో అర్ధం కాకుండా వుంది అని అంటున్నారు. అయితే నలబై ఐదు డిగ్రీల యాంగిల్ లో బెండ్ అయ్యే ఎక్సర్ సైజులు మాత్రం చేస్తూ ఉండచ్చు నంటున్నారు ఎక్స్ పర్ట్స్. వర్కవుట్స్ ముందుగా జాయింట్ల వార్మప్ చేస్తూ వుండాలి. స్టేషనరీ బైక్ వంటి కార్డియో ఎంచుకోవాలి. దీని వల్ల జాయింట్ల పై ప్రెజర్ వుండదు. ఒక వేల రన్నింగ్ అలవాటు వుంటే మృదువుగా వుండే ప్రదేశాల పై చేయాలి. లెగ్ ఎక్సర్ సైజ్ లు చేస్తే తేలిక పాటి వెయిట్స్ వదలి. మోకాళ్ళ చుట్టు గల కండరాళ్ళకు బలోపేతం చేయగలిగిన వ్యాయామాలు చేయాలి. ఏ మాత్రం నొప్పి అనిపించినా వెంటనే మానేయాలి.