ఫ్రిజ్ లో పెట్టేస్తే ఒక్కో సారి బ్రెడ్ బాగా గట్టిగా అయిపోటుంది. దీన్ని తాజాగా తయ్యారు చేయాలంటే చిల్లులున్న పళ్ళెం లో ఆ గట్టి పడిన బ్రెడ్ వుంచి దీన్ని సలసలా మరుగుతున్న  నీళ్ళ గిన్నె పైన ముతా లాగా కొన్ని సెకెండ్లు ఉంచితే చాలు బ్రెడ్ మృదువుగా అయిపోటుంది. బీన్స్, టమాటోల కూర వండుకోవాలని అనిపిస్తే వేటికవి విడిగా వండి తర్వాత కలుపుకుంటే కూర బావుంటుంది. వంట ఇంట్లో రాగి పాత్రలు రంగు కోల్పోతే తిరిగి మెరిసిపోతాయి. వంటిట్లోని గ్లాసులు, గిన్నెలు వంటి గాజు వస్తువులని కొన్నాళ్ళు వడక మసకగా పాతవిగా కనిపిస్తాయి. వాటికి చాక్ పీస్ ముక్కాల పొడిని పట్టించి తోమి, నీళ్ళతో కడిగి పొడి గుడ్డతో తుడిచి చుస్తే కొత్తవిలా తళతళ మంటూ మెరిసిపోతాయి.

Leave a comment