కాఫీ గురించి ఇంకా చక్కని అధ్యాయనం. కాఫీలో ఉండే కెఫిన్ కి నొప్పిని తగ్గించే శక్తి ఉందని అలబామా యూనివర్సిటీ అద్యాయనకారులు చెబుతున్నారు.కెఫిన్ వాడకాన్ని బట్టి నొప్పిని భరించే శక్తిలో హెచ్చు తగ్గులు ఉంటాయన్న విషయం అద్యాయనంలో తేలింది.19నుంచి 77 ఏళ్ళ వయసుగల 62 మంది పైన కాఫీ,టీ సాదా చాక్లెట్ వంటి ఇతర వినియోగాలను కెఫిన్ ప్రభావాన్ని అధ్యాయనం చేశారు.కెఫిన్ ఎక్కువగా శరీరంలోకి వెళ్ళిన వారిలో నొప్పిని భరించే శక్తి ఎక్కువగా ఉన్నట్లు కనిపెట్టారు.వీరందరు సగటున రోజుకు రెండు కప్పుల కాఫీ తాగేవాళ్ళు.170 మిల్లీ గ్రాముల కెఫిన్ వినియోగించుకునేవాళ్ళుగా రికార్డైంది.

Leave a comment