Categories
కోవిడ్ సెకండ్ వేవ్ గురించి వింటూ ఉన్నాము. ఇలాటి సమయంలో మాస్క్ ధరించే విషయంలో అలక్ష్యం వద్దంటున్నారు వైద్యులు .60 ఏళ్ల వయసు పైబడిన వారు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు,వ్యాధి గ్రస్తుల కుటుంబీకులతో గడిపే వాళ్ళు తప్పనిసరిగా సర్జికల్ మాస్క్ ధరించాలి. ధరించి మాస్క్ ముక్కు, నోరు, గడ్డం కప్పేలా ఉండాలి. ఐదేళ్ల లోపు పిల్లలు మాస్క్ ధరించనక్కర్లేదు.తామంతట తాము మాస్క్ ధరించడం పట్ల అవగాహన వచ్చిన పిల్లలు నాన్ మెడికల్ లేదా ఫ్యాబ్రిక్ మాస్క్ ధరించాలి.మాస్క్ వేసుకోవటం,వేసుకునే విధానం రెండు ముఖ్యమే వేసుకునే ముందు తీసేసిన తరువాత కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి ఏదైనా టీకా వచ్చే వరకు మాస్క్ సామాజిక దూరం పాటించటం రెండు అత్యవసరమే.