జామ పండు ఎలా తిన్నా రుచి, పోషకాలు తగ్గకుండా ఉంటాయి. ఈ పండు నుంచి విటమిన్- సి, లైకోపిన్,యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే జామపండు లోని మెగ్నీషియం మనం తీసుకునే ఇతర ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలను సరిగ్గా సేకరించేందుకు సహకరిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ని బయటకు పంపటంలో కీలకంగా పని చేస్తాయి. ఎక్కువ పీచు,తక్కువ  గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే జామ పండు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. సోడియం పొటాషియం నిల్వల్ని సమన్వయపరిచి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఒక జామపండులో రోజుకి అవసరమైన 12 శాతం పీచు శరీరానికి అందుతుంది.

Leave a comment