Categories
పైనాపిల్ స్ముథీ తో పోషకాలు అందుతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ కాలంలో సాధారణంగా ఎదురయ్యే దగ్గు జలుబు బాధించకుండా ఉండాలన్నా, రోగనిరోధకశక్తి పెంచుకోవాలన్న స్ముథీ తయారు చేసుకొని కుటుంబ సభ్యులు అందరూ తీసుకోండి అంటున్నారు.పైనాపిల్ అరటి పండు ముక్కలు కప్పు చొప్పున తీసుకోవాలి వీటితోపాటు నాలుగైదు ఆపిల్ ముక్కలను మిక్సీ జార్ లో వేసి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి కాసిని పాలు లేదా నీళ్లు పోసి ఈ ముక్కలను జ్యూస్ చేసుకోవాలి ఇందులో కొన్ని బాదం పలుకులు వేసుకుంటే రుచి కూడా. ఎన్నో పోషకాలు ఉన్న ఈ స్ముథీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.