ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వస్తువులకు మ్యూజియంలో వెలిశాయి . కొన్ని వింతైనవి ,ఇలాంటివి కూడా ఏర్పాటు చేయవచ్చు అని ఆశ్చర్యం గొలిపేలా ఉంటాయి . క్రొయేషియా జాగ్రెట్ లో మ్యూజియం ఆఫ్ బ్రోకెన్ రిలేషన్ షిప్స్ పేరుతో ఒక మ్యూజియం ఉంది .బలంగా విష్ఠిక ,డ్రెజర్ గ్రుబ్బకే అనే ప్రేమికులు నాలుగేళ్ళ ప్రేమ తర్వాత బ్రేకప్ చెప్పుకొన్నారు . మరి ఇచ్చుకొన్న బహుమతుల మాటేమిటో ఎక్కడైనా మ్యూజియంలో పెడితే అనుకున్నారు ప్రేమకనుకలన్నీ ఒక దగ్గర కు వచ్చేలా బ్రేకప్ చెప్పుకొన్న వాళ్ళు ఆ గిఫ్ట్ లన్ని ఇక్కడ ఇచ్చేలా ఓ మ్యూజియం డిజైన్ చేశారు . 2006 లో మొదలైన ఈ మ్యూజియం లో ఇప్పుడు ప్రేమికులు వదిలేస్తున్న కానుకల సంఖ్యా ఎక్కువై చోటు లేకుండా పోతుందట . అంత పాపులర్ ఈ మ్యూజియం దీనికి సందర్శకులు ఎక్కువే .
Categories