Categories
కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తే దేన్నైనా ఉపయోగంలోకి తెచ్చుకోవచ్చు . చైనాలోని జిన్ చున్ అనే గ్రామంలో ఒక పెద్ద గుహ ఉంది . విశాలంగా ఉంటుంది. గుహ బయట వాతావరణం లో ఏమార్పులొచ్చినా ఆటకి అంతరాయం కలగదు వర్షం పడినా,సుడిగాలి వీచిన సమస్యే లేదు . ఈ గుహని బాస్కెట్ బాల్ కోర్ట్ గా మార్చలని నిర్ణయించుకొన్నారు ప్రజలు ,ప్రభుత్వం అనుమతి కోసం అర్జీలు పంపేరు . అనుమతితో పాటు చైనా ప్రభుత్వం తరప్యూన్ గుహ నిర్మాణానికి లక్ష యాన్ లు వచ్చాయి . ఇంకేముందీ గుహ కాస్తా బాస్కెట్ బాల్ కోర్ట్ అయిపోయింది గుహ ద్వారం దగ్గరే బోలెడన్ని మెట్లు కట్టి ప్రేక్షకులు కూర్చునే ఏర్పాట్లు కూడా చేసారు .