పసిబిడ్డలను ఒక్క గంట సేపు బయటకు తీసుకు వెళ్ళాక  వాళ్లకు ఎన్నో అవసరాలు వస్తాయి. అనుకూలంగా వాళ్లు పడుకునే చోటు, పాలసీసాలు, డైపర్లు, బట్టలు ఎన్నో కావాలి. ఇవన్నీ ఒక బ్యాగ్ లో సర్దుకుని పోయేలా మార్కెట్లోకి ట్రావెల్ పోర్టబుల్.పోర్టబుల్ బేబీ కిట్  బ్యాగులు వచ్చాయి ఇది మామూలుగా మడిచి ఉన్నప్పుడు జిప్పులతో ఉండే అరాలు కలిగిన బ్యాగ్ లా కనిపిస్తుంది.ఈ అరల్లో పిల్లల సామాగ్రి విడివిడిగా పెట్టుకోవచ్చు వాళ్లను పడుకో బెట్టాలి అనుకుంటే బ్యాగ్ మధ్యలో ఉండే క్లిప్పులు తీసేస్తే వెడల్పుగా చక్కగా ఒక చిన్న బెడ్ లాగా తయారవుతుంది. అందులో పాపాయిని పడుకోబెట్టవచ్చు.ఈ కరోనా సమయంలో పిల్లల్ని జాగ్రత్తగా బయటికి తీసుకు పోవాలంటే ఇలాంటి బ్యాగ్ ఉండాలి.

Leave a comment