Categories
గుడ్లు అద్భుతమైన చౌక అయిన ప్రోటీన్ ఆధారిత గుడ్ ఫుడ్ అనడంలో సందేహం ఏమి లేదు. కూరగాయల కంటే గుడ్ల నుంచి ఎక్కువ లూటెన్ శరీరం గ్రహిస్తుంది. ప్రతిరోజు శరీరానికి అవసరయ్యే ప్రోటీన్ లో 25 శాతం గుడ్డు నుంచి లభిస్తుంది. శరీరంలో ప్రోటీన్లు లోపం ఏర్పడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. జీర్నక్రియ మందగించి జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లుతుంది. కీళ్ళు కండరాల నొప్పులు వస్తాయి. జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యలు రాకుండా ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్డు ఆహారంలో భాగాంగా తీసుకుంటే ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి. పచ్చ సొనలో నాలుగైదు గ్రాముల ఫ్యాట్ ఉంటె ఆమ్లెట్ లో ఒక పచ్చసొన మాత్రమే వేసి ఆకుకురలు,బఠానీలు,క్యారెట్ వంటి వాటితో భర్తి చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది.