Categories
లక్షలాది మందిపై విస్తృతంగా జరిపిన అధ్యయనాల్లో దృఢమైన రిలేషన్ షిప్ లోపిస్తే అనారోగ్యల బారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించారు. సామాజిక బాంధవ్యాలు బావుంటే డిప్రెషన్ ,జ్ఞాపక శక్తి తరుగుదల వంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఒంటరి తనం జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుందనీ అలాగే రోగనిరోధక వ్యవస్థ కూడా ప్రభావితమై అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ఒంటరి తనం ఎదుర్కొనే వాళ్ళలో రక్త పోటు 30 పాయింట్లు అధికంగా ఉంటుంది. ప్రేమ ఇంటర్ కనెక్షన్ ఎన్నో మార్గాల్లో ఉంటాయి. వ్యక్తులతో ,పెంపుడు జంతువులతో ఆధ్యాత్మిక శక్తులతో ఏ విధంగానైనా బంధావ్యాలు పెంచుకోనే వీలుంది. ఫలితంగా హార్మోన్స్ లో అనుకూలత పెరిగి శరీరం ఉపశమనం పొందుతుంది.