గ్రామాలన్నీ ఒకలాగే ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లా లోని కొవ్వలి మాత్రం చాలా ప్రత్యేకం ఈ ఊర్లో అందరూ కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. 2013 లో ఈ ఊరికి చెందిన వెలమాటి మనోహరి కి ఈ ఆలోచన వచ్చిందట గ్రామ్ దీప్ పేరుతో వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపులుగా ఏర్పడి గ్రామాభివృద్ధికి కూడా పనికి వచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని అనుకోని సంక్రాంతి ని వేదిక గా చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఆహ్వాన పత్రికలు కొట్టించి మరి ఊరి వారిని సంక్రాంతి సకుటుంబంగా రండి అని పిలుచుకుంటారు. భోగి మంటలు, గోదాదేవి కల్యాణం, సంక్రాంతి లక్ష్మీపూజ, గొబ్బెమ్మల ఏర్పాట్లు అన్ని గ్రామస్థుల సమిష్టిగానే చేస్తారు. స్టాల్స్ ఏర్పాటు చేస్తారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం నేచర్ వాక్ పేరుతో పంట పొలాలు, కాలువ గట్లు సరదాగా చూసే ఏర్పాటు చేస్తారు. తిరుగు ప్రయాణం వెంట తీసుకు వెళ్లేందుకు పిండి వంటలు సిద్ధం చేసి ఇస్తారు ఈ కలిసికట్టు సంక్రాంతిని చూసేందుకు ఎవరైనా వెళ్లొచ్చు. కానీ ముందుగా ఆ విషయం వాళ్ళకి తెలియజేయాలి.
Categories