భూమిలో కలిసిపోయి భూమికి సారాన్ని అందించే శానిటరీ నాప్ కీన్స్ ను తయారు చేస్తుంది తన్వీ జోహ్రి.ఈమె స్తాపించిన అంకుర పరిశ్రమని ఫోర్బ్స్ గుర్తించింది. తన్వీ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని మధర.సింథటిక్ శానిటరీ నాప్ కీన్స్ ప్రత్యామ్నాయం కోసం వెతికి.శాస్త్రవేత్తల సహకారంలో మొక్కజొన్న పిండి,వెదురు గుజ్జుతో నాప్ కిన్స్ తయారు చేసింది. ఇది చర్మానికి హాని చేయదు భూమిలో కలిసిపోతాయి.కార్మేసీ పేరుతో ఒక అంకుర పరిశ్రమను ఒక స్నేహితున్ని సాయంతో మొదలుపెట్టింది.అమె కష్టం అని ఫోర్బ్స్ గుర్తించింది.ఆమె వార్షికాదాయం కోటి రుపాయలు దాటిపోయింది. కార్మెసీ ఓ సామాజిక వ్యాపార సంస్థగా గుర్తింపు పొందింది.