Categories

పిల్లలు చేసిన ప్రతి చిన్న పనినీ మెచ్చుకుంటూ ఒక చక్కని బహుమతి చేతిలో పెట్టండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . అవన్నీ ఆ క్షణానికి పరిమితం కావు ఆ బహుమతి పుచ్చుకున్న జ్ఞాపకం శాశ్వతం గా వాళ్ళ మనసులో ఉండి పోతుంది. ఎంత వయసు వచ్చినా ఒక జ్ఞాపకంగా వాళ్ళ మనసులో ఉండి పోతుంది. పెద్దయ్యాక ఇవన్ని స్నేహితులతో, భాగస్వామితో తప్పకుండా పంచుకుంటారు ప్రతిసారీ పిల్లల మనసులో తల్లిదండ్రులు తమ తో గడిపిన సమయం , తమకి అందిన బహుమతి ఒక అందమైన అనుభవంగా మిగులుతుంది అంటున్నారు పరిశోధకులు. ఇప్పుడైతే తీసుకున్న వీడియోలు ఫోటోలు కూడా ఎప్పుడూ చూసుకున్నా ఆ సంతోషం ఇస్తాయని అంటున్నారు అందుకే పిల్లలకు ఒక జ్ఞాపకం వంటి బహుమతిని అందించండి అంటున్నారు.