చైనా సంస్కృతి నుంచి వచ్చిన చికిత్స విధానం ఆక్యుపేజర్ శరీరం మరున్న భాగాల పైనచేతివేళ్ళ తో నెమ్మదిగా నొక్కటం వల్ల ఆ ప్రాంతలో పెట్టె ఒత్తిడి వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వదిలించుకోవచ్చని ఆక్యుపేజర్ నిపుణులు చెపుతారు. ఆక్యుపేజర్ వెనక ఓ సిద్ధాంతం చెపుతున్నారు . మానవ శరీరంలో చి అనే శక్తి ప్రవహిస్తూ వుంటుంది. అటువంటి శక్తి ప్రవాహానికి ఏదైనా అడ్డుపడితే ఆనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. ఎపుడైతీ శక్తీ ప్రవాహం అడ్డుకోబడుతుందో ఆ ప్రదేశంలో వత్తిడి పెడితే ఆ శక్తి ప్రవాహం మళ్ళీ ప్రవహించటం మొదలవుతుంది. ఆక్యుపేజర్ లో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై బాధను తగ్గించి ప్రశాంతత ఇస్తాయి. శరీరం పైన కీలకమైన ప్రదేశాలు గుర్తించి ఆ ప్రదేశం పైన తగిన విధంగా వత్తిడి పెట్టాలి. ఆ ఒత్తిడి ఏ స్థాయిలో వుండాలి ఎంతసేపు పెట్టాలి అన్నది శరీరం అనుభవిస్తున్న అసౌకర్యన్ని బట్టివుంటుంది. ఉదాహరణకు నిద్ర రాకపోతే కనుబొమ్మల మధ్య భాగంలో వేళ్ళలో వత్తిడి పెడితే మనసు తేలిక పది నిద్ర వస్తుంది. ఇది ట్రయ్ చేసి చూసి నిద్ర వస్తే అప్పుడు దీన్ని నమ్మి ఏదైనా సమస్య కోసం ఆక్యుప్రేజర్ స్పెషలిస్ట్ ని సంప్రదించండి.
Categories