పాలు తాగితే మంచిది. బలంగా అరిగ్యంగా ఉండటంలో సందేహం లేదు. అలాగే పాలు చర్మాన్ని కాంతివంతం చేయడంలో కుడా బాగా ఉపయోగపడతాయి. కప్పు పచ్చి పాలు, తేనె, నాలుగు చుక్కలు కొబ్బరి నూనె కలిపిస్నానం చేస్తే, అదీ గోరువెచ్చగా వున్న నీటిలో ఈ మిశ్రమం కలిపి వారానికి రెండు సార్లు స్నానం చేస్తే, చర్మం మెత్తగ, మెరుపుతో వుంటుంది. చలికి పగుళ్ళు రాకుండా వుంటుంది. పాలలో విటమిన్ ఎ ఎక్కువ మోతాదులో వుంటుంది. ఇది చర్మాన్ని పొడిబార నివ్వదు. అలాగే ముందు చర్మాన్ని శుభ్రం చేసుకుని పాలతో మొటిమలు, మచ్చు వున్న ప్రాంతంలో మృదువుగా రాస్తే ఫలితం వుంటుంది. పాలలోని లాక్టిక్ ఆమ్లం పిగ్మింటేషన్ తగ్గిస్తుంది. హర్మానికి కావాల్సిన తేమ ఇస్తుంది. ఉదయం నిద్ర లేవగానే శుబ్రంగా వున్న మొహం పై దూది తో పాలు అప్లయ్ చేసి గంట ఆగి, వేడి నీళ్ళతో కడిగేస్తే జిడ్డు పోతుంది మొహం మెరుపుతో వుంటుంది.

Leave a comment