మా పాపాయిని పరువు మీద నుంచి దించం. దీని మోకాళ్ళు నొప్పెడతాయని కింద నెల పైన కాసేపయినా ఉంచం అనే తల్లిదండ్రుల అతి ప్రేమను తప్పు పడుతున్నాయి అద్యాయినాలు. అడుగులు వేసే వయస్సు వచ్చే సరికే అంటే పది నెలల లోపే పిల్లలు ఎన్నో నైపుణ్యాలు నేర్చుకోవాలి అంటున్నారు. కదలికలతోనే మెడ కండరాలు నిలిపే మెళకువలు నేర్చుకుంటారు. నడిచేందుకు కావలసిన కండరాల బలం తెచ్చుకుంటారు. వెన్ను చురుదనం సంతరించుకుంటుంది. తన రెండడుగులు వేసే ప్రయత్నం చేస్తేనే అది పాపాయి మొదటి విజయం. తనను ఆడించే అమ్మలాగా నాన్న లాగా తన శరీర భాగాలు కదిలిస్తూ బిడ్డ నడకలు నేర్పాలి. పిల్లలు నడకలో పర్ ఫెక్ట్ కావాలంటే వాళ్ళని నడిపించాలి, మెట్లెక్కించాలి. అన్ని కండరాలు వాడుతూ వాటిలో బలం పెంచుకోవాలి. అంచేత పిల్లలని సహజంగా నేలపైన అన్ని నేర్చుకోవాలి. ప్రేమ వుంటే ఇంట్లో నేలను శుబ్రంగా క్లీన్ చేసి వాళ్ళు అర్గ్యంగా ఉండేలా చూడాలి.

Leave a comment