పావ కథైగల్, సుధ కొంగర, గౌతమ్ మీనన్ వెట్రియారన్,విగ్నేష్ శివాన్ దర్శకత్వం వహించిన నాలుగు కథల సమాహారం ఇందులో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన oor iravu ఊర్ ఇరువు ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ సాయి పల్లవి తండ్రి కూతుళ్లుగా నటించారు.ప్రేమించి పెళ్లి చేసుకుని చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఆచూకీ తెలుసుకున్న తండ్రి ఆమె ఇంటికి వెళ్లి ప్రేమగా మాట్లాడి ఇంటికి తీసుకువస్తాడు.ఎంతో హాయిగా, ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగే కూతురు గర్భం పోయేలా విషం తినిపిస్తాడు.సీమంతం చేస్తానంటే వచ్చిన కూతురు విషం తిని మరణించటంతో ఆ ఘోరానికి ఆమె తల్లి మతి చెలించి హాస్పిటల్ పాలవుతుంది.అల్లుడు కంప్లైంట్ చేయడంతో విషయం కోర్ట్ వరకు వెళ్తుంది. కానీ తండ్రి నిర్దోషిగా బయటకు వస్తాడు.అల్లుడు హైకోర్ట్ కు అప్లయ్ చేసి న్యాయం కోసం చూస్తుంటాడు. ఇది ఈ ఎపిసోడ్ లో కధ. ఈ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

రవిచంద్ర.సి
7093440630

Leave a comment