Categories
మధ్యప్రదేశ్ లోని బైగా తెగకు చెందిన గిరిజన ఆర్టిస్ట్ మారావి మంగళాబాయి.ఈ బైగా తెగ ప్రజలు తన సంస్కృతి సంప్రదాయాలను వంటిపై పచ్చబొట్టుగా వేయించుకుంటారు.పుల్లలు,సూదులతో ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ టాటూ వేస్తారు. ఏడేళ్ల వయసు నుంచే ఈ పచ్చబొట్టు వేయటం నేర్చుకుంది మంగళ బాయి, దాదాపుగా అంతరించిపోతున్న ఈ గిరిజన సాంప్రదాయ పచ్చబొట్టును జాగ్రత్తగా నేర్చుకొని అందులో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది మంగళ బాయి.