Categories
ప్యాకెట్ పాలు మంచిదా, లేదా విడిగా దొరికే పాలు మంచివా అని ఎప్పుడూ డైలమా ఉంటుంది.ప్యాకెట్ పాలు పాశ్చరైజ్డ్ చేయబడి ఉంటాయి.ఈ పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలు వేడి చేసి చల్లారిన తరువాత ప్యాకెట్ల లో నింపుతారు.ఈ ప్రక్రియ ద్వారా పాలలోని వ్యాధికారక సూక్ష్మజీవులు నశిస్తాయి.అలాగే ప్యాకెట్ పాలు వివిధ పాళ్ళలో వెన్నను కలిగి ఉంటాయి. ఈ పెద్ద కంపెనీ బ్రాండ్ల పాలలో పాలు కల్తీ అయ్యే అవకాశం తక్కువ.పితికే పాలు శుభ్రమైన చేతులతో, శుభ్రమైన పాత్రలలో ఉంచి పిండిన వెంటనే అందిస్తున్నారు లేదో తెలియదు కనుక ప్యాకెట్ పాలు శ్రేష్టం. ప్యాకెట్ పాలైన విడిగా కొన్న పోషక విలువల్లో మాత్రం పెద్ద తేడాలు ఉండవు.