తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడే నిమిత్తం అత్యంత క్లిష్ట సమయంలోనే శస్త్ర చికిత్సకు వెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శస్త్ర చికిత్స ద్వారా ప్రపంచంలోకి వస్తున్న పిల్ల సంఖ్య అత్యధికంగా వుంది. ఈ అంశంలో తెలంగాణా తోలి స్థానంలో వుంటే ఆంధ్రప్రదేశ్ నాలుగోవ స్థానంలో వుంది. తెలంగాణా తోలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40.6 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో 74.9 శాతం తల్లులకు శస్త్ర చికిత్స ద్వారానే కాన్పులు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రాలో ప్రభుత్వ ఆసుపత్రులలో 25.5 శాతం ఆసుపత్రుల్లో 57 శాతం బిడ్డలు కడుపు కొత ద్వారానే బయట పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో త్రిపుర పశ్చిమ బెంగాల్లో మాత్రం తెలంగాణా లో పోటీ పడుతున్నాయి. శస్త్ర చికిత్సలు ఈ స్థాయి లో పెరిగిన మాతృ శిశు మరణాలు మాత్రం తగ్గడం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Categories