Categories
ఏ హోటల్లోనో ఎదో తినగానే ఫుడ్ పాయిజన్ అయిపోతుంది . వికారం ,వాంతులు జ్వరం మొదలైన ఫుడ్ పాయిజన్ లక్షణాలు ఒక్కోసారి ఇంట్లో కూడా ఆహారమవిషయం లో సురక్షిత మార్గం అనుసరించాలి . రా పదార్దాల తయారీకి .రెడీ టు ఈట్ పదార్దాలకు విభిన్న కటింగ్ బోర్డులు ఉపయోగించాలి . అన్నింటికీ ఒకటే వాడుతూ ఉంటే గ్రెస్ కలుషితాలు తప్పవు . రా మీట్ పౌల్ట్రీ సీ ఫుడ్ లేదా గుడ్లు వంటివి వాడిన ప్లేట్లలో రా ఫుడ్ తినకూడదు . ఎప్పుడు రా ఫుడ్ ఉడికించిన ఆహార పదార్దాలకు దూరంగా ఉంచాలి . ఫ్రీజ్ లో కూడా తప్పనిసరి జాగ్రత్త వహించాలి . మాంసాహార పదార్దాల పై తప్పనిసరిగా మూతలు పెట్టాలి . వీటిని మిగతా పదార్దాలు పెట్టిన అరల కంటే కిందగా ఉంచాలి .