Categories
సాయంత్రం వరకు ముఖం మచ్చలు కనబడకుండా మృదువుగా మెరుస్తూ ఉండాలనుకుంటే సరైన ఫౌండేషన్ ఎంచుకోవాలి. స్కిన్ కలర్ కు మ్యాచ్ అవ్వాలి. పొడి చర్మం అయిటే హైడ్రేటింగ్ మాయిశ్చురైజింగ్ పదార్దాలుండాలి. జిడ్డు చర్మం అయితే ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్ తీసుకోవాలి. మినరల్ ఫౌండేషన్స్ సెన్సిటివ స్కిన్ కు చక్కగా సూటవ్వుతాయి. ఫౌండేషన్ ను షాపులో ఫిజికల్ గా వెళ్లి పగటి వేళ చూసుకుని మరీ కొనుక్కోవాలి కానీ ఆన్ లైన్ షాపింగ్ కూడదు. షాపులో అయిటే, షాపువాళ్ళు అనుమతిస్తే కష్ట రిస్ట్ పై అప్లయ్ చేసి చుస్తే సరిగా సూటవవుతుందో లేదో అర్ధం అవ్వుతుంది. నాణ్యత విషయం లో జాగ్రత్త తీసుకోవాలి. మంచి పెరున్న బ్రాండ్ ఐటమ్స్ ని తీసుకోవాలి.