Categories
ఒక చక్కని కళాకారిణికి చక్కని అభిరుచి కూడా ఉంటుందని రుజువు చేసింది ప్రియాంకా చోప్రా. ఆమె తల్లి ముధు చోప్రాతో కలిసి ప్రియాంకా Purple Pebble Pictures (PPP) సంస్థను ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో కథ ప్రాధాన్యత ఉన్నా చిత్రాలను నిర్మిస్తోంది ప్రియాంక. ఫాభీ ఎటైర్ వాలా దర్శకత్వంలో నేపాలీ భాషలో పహూనా ,ది లిటిల్ విజిటర్స్ అన్న చిత్రాన్ని నిర్మించింది ప్రియాంక. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన ముగ్గురు పిల్లలు తిరిగి ఇంటికి చేరేందుకు ఎలాంటి కష్టాలు పడ్డారన్న కథతో నిర్మించిన ఈ చిత్రానికి జర్మనీలో జరుగుతున్న స్కింజెల్ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంలో రెండు పురస్కారాలు లభించాయి. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్దంగా ప్రశంసలు దక్కాయి.