Categories
పళ్లు ఫలానా టైంలోనే తినాలి రూలేం లేదు.ఏ టైంలో అయినా తినవచ్చు అంటూన్నారు ఎక్స్ పర్ట్స్.ని జానికి పళ్లు భోజనం తో పాటు తీసుకుంటే ,పళ్లలో ఉన్న అనేక ఫైటో రసాయనాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి కూడా. ఎన్నోరకాల విటమిన్లు ఖనిజాలతో పండ్లు రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా వీటిలో ఉండే పీచు ఆరోగ్యనికి నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. షుగర్ లెవల్స్ ఏ మాత్రం పెగరగవు. పండ్లలో ఉండే సెల్యూలోజ్ ఫైబర్ షుగర్ లెవల్స్ ని తగ్గిస్తాయి. రోజుకు 500గ్రాముల పళ్లు ప్రతి ఒక్కరు తప్పని సరిగా తీసుకోవాలి. వంట బెడద లేకుండా ఏ సమయంలోఅందుబాటులో ఉండే ఆరోగ్యన్నిచ్చే పళ్లు భోజనంలో భాగంగా తీసుకోంటే మేలు.