Categories
చమటకు తడిసి బూట్లలో దుర్వాసన వస్తు వుంటుంది. చిన్ని చిట్కాలతో సమస్యను పోగొట్టొచ్చు. బూట్లు వాసనగా వుంటే వాటిలో వంట సోడా చల్లి అలా రాత్రంతా వదిలేస్తే అది చమటను దుర్వాసనను పిల్చుకుంటుంది. కాఫీ పొడి, వంట సోడా కలిపీ పొట్లం కత్తి బూట్లలో వేసి ఉంచితే తెల్లారే సరికి దుర్వాసన పోతుంది. నిమ్మరసంలో రోజ్ వాటర్ కలిపి బూట్ల పై చల్లినా దుర్వాసన పోతుంది. బూట్లలో తేమ చేరినా దుర్వాసన కావచ్చు. వాటిలో కాగితం వుండాలని కుర్చీ వాటిని గాలి తగిలే ప్రదేశంలో పెట్టినా వాసన పోతుంది.