జపాన్ ఆర్ధికంగా చాలా వేగంగా పెరిగింది. కానీ స్త్రీల విషయంలో వివక్ష మాత్రం ఎంతో ఎక్కువ. జపాన్ లో ఎక్కువగా ఉండే మర మనుషుల లాగా స్త్రీలు కూడా అంతే అనుకొంటారు. మన దేశంలో లాగే స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు ఆఫీసుల్లో ఏవీ ఉండవు. ఇంట్లో పిల్లలుంటే వాళ్ళ కోసం సమయం కేటాయించవలసిన పనిలో కాసేపు ఆడవాళ్ళున్న దాన్ని మన దేశంలో లాగే వెక్కిరీంతగా మాట్లాడతారు. లెక్కలేనన్ని వంటింటి పనులతో స్త్రీలు ఉదయాలు మొదలవుతాయి. వంటకాల విషయంలో మన వంటల కంటే వాళ్ళ వంటకాలు చాలా టైమ్ తీసుకొంటాయి. లంచ్ బాక్స్ లో సర్ది వంటింటి పనులు పూర్తి చేసి ఉద్యోగాలకు పోయే స్త్రీలు పని భారం తట్టుకోలేక తోటి పురుష ఉద్యోగుల సాధింపులు పడలేక చిన్న ఉద్యోగ్యాలలోనే పదవీ విరమణ చేస్తారు. పది చేతులున్న చాలని పనితో జపాన్ స్త్రీల జీవనశైలి మనలాగే ఉంటుంది.
Categories