Categories
![ఏదైనా సక్సెస్ వస్తే ఊరు వారి ఏకం చేయటం లేదా నష్టం వస్తే అదేదో పర్వతం మీద పడ్డట్టు బావులకు సిద్దపడటం సాధారణం మానవుల లక్షణం . కానీ ఓటమి అనేది నాకు నచ్చదు. అంటోంది ప్రియాంక చోప్రా. ఫిల్మ్ ఇండస్ట్రీ లో సక్సెస్ లు ఫెయిల్యూర్ లు ఎంత కామనో మనుషుల భావోద్వేగాలు అంతే కామన్. సినిమా ఫ్లాప్ అయితే ఒక్కళ్ళు ఒక్క రకంగా బాధపడతారు. మరి ప్రియాంక ఏం చేస్తుందో తెలుసా ఫుల్లుగా తిని పడుకుంటుందట. ఐ డోంట్ లైక్ టు ఫెయిల్ కానీ తప్పదు. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ విలువ తెలియదు. నా సినిమా ఫెయిలయితే నేను ఫెయిల్ అయ్యినట్లే. ఇంక ఏం చేయటం ఒక ఐస్ క్రీమ్ ఫుల్ గా తినేసి దుప్పటి కప్పుకుని పడుకుంటా అన్నది ప్రియాంక. ఒక్కోసారి నమ్మకం తో చేసిన సినిమా ఫ్లాప్ అవుతుంది. ప్రతి సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ నన్నీ స్థితికి తెచ్చాయి. ఒక్కో అడుగు వేస్తూ నేనింత దూరం వచ్చాను. నా నిర్ణయాల పట్ల ఎప్పుడూ బాధపడను. అన్నారు ప్రియాంక. ఇది అందరికీ వర్తించదా ??](https://vanithavani.com/wp-content/uploads/2017/02/priyanka-chopra-1.jpg)
ఇప్పుడు నా దృష్టిలో రెండే విషయాలు మెదులుతున్నాయి అంటోంది ప్రియాంక చోప్రా . ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం ,లాస్ ఏంజిల్స్ లో ఒక ఇల్లు కొనిక్కోవటం ఈ రెంటి పైనే ఆలోచిస్తాను . ఇదే ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఎక్కడ సంతోషంగా ఉంటే అదే మన ఇల్లు . మనం ప్రేమించే వాళ్ళు చుట్టూ ఉంటే చాలు . అనుకొంటున్నా అంటుంది ప్రియాంక . ఎంత సాధించిన ఒక మాములు యువతిలాగా ఉండటం ఆమె ప్రత్యేకత . ఎప్పుడూ రిస్కులకు సిద్దమే 2004లో ఐత్ రాజ్ లో గ్రే షేడ్ రోల్ చేసింది 2014లో మేరీ కోమ్ పాత్రకోసం ప్రియాంక చేసిన కృషి చాలా గొప్పది . అమెరికన్ డ్రామా క్యాంటి రో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ప్రియాంక . బాజీరావు మస్తానీ ని అభిమానులు ఎప్పటికీ మరల పోలేదు .