పెళ్ళిళ్ళలో, పార్టీల్లో డిజర్ట్స్ చుస్తే నోరు ఊరుతుంది. తినాలంటే భయం వేస్తుంది. కానీ ఇటీవల లండన్ పరిశోధనా ఫలితాలు ఒక మంచి కబురు చెప్పాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు భోజనం ముందుగా గ్లూకోజ్ అధికంగా వుండే పదార్ధాలు తినడం వల్ల మెదడుకి శరీరానికి శక్తి సరిపోయిందన్న సంఖ్య అందుతుంది. ఫలితంగా ఎక్కువ క్యాలరీలు తీసుకోలేకపోతారు. సహజంగా కడుపు నిండిన భావన కలగటం లో ఎక్కువ ఆహారం ఇటు తినలేదుకనుక అతిగా తినడం తగ్గుతుందని చక్కర అధికంగా వుండే పదార్ధాలు ఏపటైటీస్ ను కొంత నియంత్రణలో ఉంచుతాయి. కనుక డిజర్ట్ లు తినడం మానుకోకండి వాటిని భోజనం ముందు తినేయండి అంటోంది రిపోర్టు. మంచి కబురు కదా.

Leave a comment