సంక్రాంతి అంటేనే గ్రామీణ సౌందర్యం. ఆడపిల్లల సంప్రదాయ దుష్టులైన ఓణీ పరికిణీ ల అందం తిరుగులేనిది. ఈ అందమైం ప్రకృతికి ఎన్ని రంగులున్నాయో పరికిణీ ఓణీలకు అన్ని అందాలున్నాయి. ఒక అద్భుతమైన చిత్రకారుడు దీక్షగా ఒక పండగ సౌందర్యాన్ని ఆవిష్కరించాలనుకుంటే పట్టు పరికిణీ, ఓణీ,జడలో పువ్వులు కాళ్లకు అందెలు జడకుచ్చులు ఉండాల్సిందే. కళ్ళు చెదిరే రంగులతో వుండే కంచి పట్టు పరికిణీ పైకి ఎలాంటి డిజైన్ లేని సాదా ఓణీ బుట్ట చేతుల బ్లవుజు ఉంటే అది సంక్రాంతి సౌందర్యమే. సరే కంచి భారీగా వుంటుందీ అనుకుంటే నెట్ పరికిణీలు లెహెంగాలు వుండనే వున్నాయి. వాటి పైకి భారీ పనితనం ఉన్నా లేదా చక్కని అంచులు మాత్రం ఉన్నా వాటిపైకి షిఫ్ఫాన్ నెట్ జార్జెట్ బెనారస్ జార్జెట్ బూటీ దుప్పట్టాలు నప్పుతాయి. ఇక అలాoటీ అందమైన పరికిణీ పైకి బ్లవుజ్ బోట్నెక్  బ్యాక్ ఓపెన్ హైనెక్ డిజైన్ తో వుంటే  ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే మెడచుట్టూ  జ్యూయలరీ వర్క్ అద్దాలు కుట్టేస్తే  పండగవేళ ప్రత్యేకంగా ఉంటాయి. లేదా ఇంకా ఫ్యాషన్ గా ఉంటే బావుంటుందీ  అనుకుంటే క్రాప్ టాప్ లెహెంగా వేసుకుని దుపట్టా మ్యాచింగ్ లా వేసుకుంటే ఇటు ఫ్యాషనూ అటు పండగ కళా ఇట్టే వచ్చేస్తాయి.

Leave a comment