ఎడారి లో ఇసుక నే ఊహిస్తాం. కానీ దుబాయ్ లోని మిరాకిల్ ఫ్లవర్ గార్డెన్ చూస్తే కోట్లకొద్దీ పూలు కన్నుల పండుగ చేస్తాయి. 72 వేల చదరపు అడుగుల ఈ పూల వనం లో ఫ్లోరల్ క్లాక్,టెడ్డీ బేర్ , ఫ్లోటింగ్ లేడీ, హార్ట్ టన్నెల్ వంటి ప్రతి పుష్ప శిల్పం ఒక అద్భుతం. పూల తో తయారైన అతిపెద్ద ఎమిరేట్స్ ఎ 380 విమానం 58 అడుగుల ఎత్తు 35 టన్నుల బరువు ఉండే పెద్ద మిక్కీ మౌస్ లతో ప్రపంచంలో అతిపెద్ద వర్టికల్ గార్డెన్ గా మూడు గిన్నిస్ రికార్డ్ లు సొంతం చేసుకుంది. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది.

Leave a comment