Categories
తొమ్మిది వారాల్లో 15 కేజీల బరువు తగ్గాను పోషక విలువలు తగ్గకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకొని యోగా లో చక్రాసనలు వంటివి వేసి ఒక్క రోజు కూడా జిమ్ కు గైర్హాజరు కాకుండా బరువు తగ్గి పోయాను అంటుంది ఖుష్బూ సుందర్. దక్షిణాది లక్షల మందికి అభిమాన పాత్రమైన ఖుష్బూ ను తలుచుకుంటే ఆమె పేరిట కట్టిన ఆలయం ఆమె పేరు పైన ఫేమస్ అయిన ఇర్లీ లు గుర్తుకు రాక తప్పదు 40 ఏళ్లు దాటాక అధిక బరువు కు చేరిన ఆమె ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టి దానికి ఫిట్ నెస్ గోల్స్ ఎట్ 50 అని పేరు పెట్టి అధిక బరువు తగ్గించుకొని ట్విట్టర్ లో ఫోటోలు పెట్టింది ఖుష్బూ. ఏ ఆపరేషనో ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం వర్క్ వుట్స్ ఆహారంతోనే సన్నబడ్డాను అని చెబుతోంది ఖుష్బూ.