చదువులు ఉద్యోగాల కోసం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిలు ఇప్పుడు చాలా మంది అతిధి గృహాల్లో కంటే పేయింగ్ గెస్ట్ లుగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కాస్త ప్లాన్ తో వెళితే అక్కడ ఎలాంటి ఇబ్బందీ రాకుండా ఉంటుంది. అతిధులుగా ఉండేందుకు ఎవరింటికి వెళుతున్నారు ఆకాక్ష నియమ నిబంధనలను అన్నీ తెలుసుకోండి. ఒక్కోసారి తల్లితండ్రులు ఎక్కువ సార్లు వచ్చినా వద్దనే అవకాశం ఉంటుంది. అలాగే బయటకి వెళ్ళేటపుడు ఎప్పుడువెళ్తారు ? మధ్యాహ్నం భోజనం కావాలో వద్దో రాత్రి వచ్చే వరకు ఎంత సమయం అవుతుందో ముందే ఆ ఇంటి వాళ్ళతో చెప్పాలి. ఏ కారణం చేతనైన ఆఫీస్ లేటైనా ఆ విషయం వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. భోజనం బయట చేసినా ముందే చెపితే వండిన వంట వృధా కాకుండా ఉంటుంది. కేటాయించిన గది శుభ్రంగా ఉంచుకోవటం వస్తువులను భద్రంగా పెట్టుకోవటం బాధ్యత గానే తీసుకోవాలి. ఆ ఇంటి వాళ్ళ అనుమతి లేకుండా స్నేహితులను వెంట తెచ్చి అప్పటికప్పుడు భోజనం కావాలనటం చేయకూడదు. వాళ్ళు కాక మన అమ్మ నాన్న వంటి వారే మన వైపు నుంచి అసౌకర్యం కలుగనీయ వద్దు. గది నుండి వెళ్ళేటప్పుడు లైట్ తీసేసి ఫ్యాన్ ఆపేసి బాత్ రూమ్ లో నీళ్లు కట్టేసి స్నాక్స్ తిన్న పళ్ళాలు సింక్ లో పడేసి ఆ ఇంటి వాళ్ళతో స్నేహంగా మెలిగితే ఎప్పుడూ ఏ ప్రాబ్లమ్ రాదు .
Categories